NLG: మిర్యాలగూడ మండలం క్రిస్టాపురం బైపాస్ రోడ్డుపై బొల్లిగుట్ట తండా రైతుల ధాన్యం ట్రాక్టర్ను మంగళవారం టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ట్రాక్టర్ బోల్తా పడి పలువురు రైతులు గాయపడ్డారు. అదే మార్గంలో వెళ్తున్న మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వెంటనే స్పందించి, తన సొంత వాహనంలో క్షతగాత్రులను మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
ప్రమాద స్థలంలో స్పందించిన ఎమ్మెల్యే


