హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెల్వడంలో వైసీపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం

NTR: మైలవరం మండలం వెల్వడం గ్రామంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తిరుమల గ్రామంలో విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను కలుస్తున్నారు. తన భర్త తోట తిరుపతిరావు గతంలో చేసిన సేవలను తాను మరింత ముందుకు తీసుకెళ్తానని, గ్రామంలోని ప్రతి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆమె భరోసా ఇస్తున్నారు. సర్పంచ్‌గా గెలిపించాలని ఓటర్లను కోరారు.