హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాట్నాలపాలెంలో తాగునీటి కష్టాలు

AKP: కోటవురట్ల శివారు రాట్నాలపాలెంలో తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ స్తంభం కూలిపోవడంతో రక్షిత నీటి పథకం పనిచేయడం లేదు. ప్రత్యామ్నాయంగా నీరందించే మినీ ప్రాజెక్టు మోటార్లు కూడా మరమ్మతులకు గురికావడంతో నాలుగు రోజులుగా నీరు రావడం లేదు. దూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.