KMM: వైరా పలిపాడు సమీపంలో ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వస్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతిచెందగా క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి వెంటనే స్పందించిన స్థానికులు గాయపడిన వ్యక్తిని 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
చెట్టును ఢీకొట్టిన లారీ డ్రైవర్ మృతి


