CTR: కుప్పం మండలంలోని నడుమూరు ఘాట్ రోడ్డులో ఇవాళ కారు బోల్తా పడి మహిళ మృతిచెందగా, ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కుప్పం అర్బన్ సీఐ జీటీ నాయుడు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదంపై పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి


