NLG: మర్రిగూడ మండలం తిరుగండ్లపల్లిలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామిడి జంగారెడ్డి ఐదు ఎకరాల్లో పంట సాగు చేసినా ఎల్‌నినో ప్రభావంతో దిగుబడి రాక అప్పులపాలయ్యాడు. మనస్తాపంతో పురుగుల మందు తాగగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఎస్సై రాంబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
పంట నష్టంతో రైతు ఆత్మహత్య


