హైదరాబాద్: 28°C
తెలంగాణ

దమ్ము చక్రాల ట్రాక్టర్లపై ఎస్పీ హెచ్చరిక

SRPT: దమ్ము చక్రాలు అమర్చిన ట్రాక్టర్లను రహదారులపై నడపవద్దని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ రైతులు, ట్రాక్టర్ యజమానులకు ఈరోజు సూచించారు. వీటి వల్ల రోడ్లు దెబ్బతినడంతో పాటు వాహనదారులకు ఇబ్బందులు ఏర్పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ప్రజా ఆస్తుల పరిరక్షణకు, రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులకు సహకరించాలని కోరారు.