హైదరాబాద్: 28°C
వార్తలు

పాక్‌ను ఆహ్వానించిన భారత్.. ప్రతిపక్షాల ఫైర్

ఢిల్లీలో ఈనెల జరగనున్న షాంఘై సహకార సంస్థ(SCO) సదస్సుకు పాకిస్థాన్‌ను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించడంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. 'పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ వైఖరిలో ఏం మారింది?' అని ప్రతిపక్ష నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. పాక్‌కు ఆహ్వానం పంపడాన్ని వారు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. కాగా, ఈ సదస్సులో పాక్ తరఫున ఆ దేశ మంత్రి ముసాదిక్ మాలిక్ పాల్గొననున్నారు.