హైదరాబాద్: 28°C
వార్తలు

లింబో స్కేటింగ్‌లో సృష్టి గిన్నిస్ రికార్డు

లింబో స్కేటింగ్‌లో మహారాష్ట్రకు చెందిన సృష్టి ధర్మేంద్ర శర్మ సరికొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. కిందకు వంగి ఉండే అవరోధాల(descending poles) కింద నుంచి కేవలం 6.86 సెకన్లలోనే 50 మీటర్ల దూరాన్ని చేరుకుని అత్యంత వేగవంతమైన లింబో స్కేటర్‌గా నిలిచింది. ఈ అద్భుతమైన ఫీట్‌కు సంబంధించిన వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తమ అధికారిక 'X' ఖాతాలో పోస్ట్ చేస్తూ సృష్టి ప్రతిభను కొనియాడింది.