హైదరాబాద్: 28°C
వార్తలు

చర్లపల్లి రైలు ఘటన.. విచారణ ముమ్మరం

TG: హైదరాబాద్‌లోని చర్లపల్లిలో జరిగిన రైలు అగ్నిప్రమాదంపై విచారణ ముమ్మరం చేశారు. ఈనెల 14న ఆ రైలు ఢిల్లీ నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు. నిన్న సాయంత్రం మంటలు చెలరేగడంతో బోగీ దగ్ధమైన విషయం తెలిసిందే. అయితే ప్రమాదానికి గల కారణాలపై రైల్వే పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే క్లూస్ టీమ్స్ ఆధారాలు సేకరించింది.