హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విజయ డెయిరీ బోర్డు అత్యవసర సమావేశం

కృష్ణా: విజయ డెయిరీ ఛైర్మన్ ఎన్నిక చెల్లదని హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో బోర్డు డైరెక్టర్లు ఇవాళ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. తొమ్మిది మంది సభ్యులు పాల్గొని కోర్టు తీర్పు, ప్రస్తుత పరిస్థితులు, తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు. బోర్డు భవిష్యత్ నిర్ణయాలపై ఈ సమావేశంలో సమాలోచనలు జరగనున్నాయి.