హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి

HNK: ఎల్కతుర్తి మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థినుల సంఖ్య, ఉపాధ్యాయుల హాజరు తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థినులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు, ప్రతి విద్యార్థిని బేసిక్ ఇంగ్లీష్‌లో మాట్లాడేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.