హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్హులైన పేదలకు పింఛన్లు అందించడమే లక్ష్యం

MHBD: అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందించి ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమని MLA డా.మురళి నాయక్ అన్నారు. ఇవాళ ఇనుగుర్తి మండల కేంద్రంలోని రైతువేదికలో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితరులకు సంక్షేమ పథకాలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.