హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ హౌస్ అరెస్ట్

ప్రకాశం: సింగరాయకొండలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మంగళవారం నామినేషన్ల చివరి రోజు అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఓటమి భయంతోనే కూటమి ప్రభుత్వం వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటూ, బలవంతపు ఏకగ్రీవాలకు ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి సురేష్ ఆరోపించారు.