హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల నామినేషన్ల వేళ పోలీసుల హెచ్చరిక

KRNL: రేపటి నుంచి 20వ తేదీ వరకు జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల వేళ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకూడదని పెద్దకడబూరు ఎస్ఐ మారుతి సూచించారు. నామినేషన్ కేంద్రాల వద్ద గుంపులుగా గుమిగూడడం, అనుమతి లేని వ్యక్తులు ప్రవేశించడం, గొడవలకు పాల్పడడం నిషేధమన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.