హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రీడా పోటీలను ప్రారంభించిన మంత్రి

MBNR: జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో 8వ ఖేలో ఇండియా క్రీడా పోటీలను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రతిభావంతులైన క్రీడాకారులకు కొదవలేదని, రాష్ట్ర ప్రభుత్వం వారిని ప్రోత్సహిస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, క్రీడాకారులను జాతీయ స్థాయికి తీర్చిదిద్దుతామని తెలిపారు.