హైదరాబాద్: 28°C
వార్తలు

1000 విమానాల కొనుగోలుకు కేంద్రం సిద్ధం

ఒకవైపు ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటం, మరోవైపు విమానాల కొరత ఉన్న నేపథ్యంలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. ఈజిప్ట్ పర్యటనలో ఉన్న ఆయన.. దేశ అవసరాలకు అనుగుణంగా మరో 1,000 పౌర విమానాలను కొనుగోలు చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఇప్పటికే 1,200 విమానాలకు ఆర్డర్ ఇచ్చామన్నారు. మొత్తం 2 వేలకు పైగా విమానాలు అవసరమని, త్వరగా సరఫరా చేయాలని ఆయా సంస్థలను కోరుతున్నట్లు వెల్లడించారు.