ASR: చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు ఈనెల 17నుంచి స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ఎంసీ సాహిత్య మంగళవారం తెలిపారు. OAMDC-2026లో మిగిలిన కన్వీనర్, మేనేజ్మెంట్ కోటా సీట్లను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఇంటర్ ఉత్తీర్ణులు బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ అవకాశం వినియోగించుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
డిగ్రీ స్పాట్ అడ్మిషన్లు ప్రారంభం


