హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు చందన ఎంపిక

PDPL: ఓదెల మండలం కొమిర గ్రామానికి చెందిన పలుకల మణి చందన జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికైంది. కమలాపూర్ ఎంజేపీ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆమె, ఈనెల 8న నిర్మల్‌లో జరిగిన ఎస్టీఎఫ్ అండర్‌-19 పోటీల్లో ప్రతిభ చాటింది. ఈనెల 18 నుంచి 22 వరకు చండీగఢ్‌లో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొననుంది.