హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆ గ్రామంలో నాలుగుసార్లు ఏకగ్రీవం!

TPT: దొరవారిసత్రం మండలం వేణుంబాక గ్రామం పంచాయతీ ఎన్నికల్లో ఆదర్శంగా నిలుస్తోంది. 2006, 2013, 2015, 2021 ఎన్నికల్లో గ్రామస్తులు ఏకగ్రీవంగా సర్పంచ్‌ను ఎన్నుకున్నారు. హిందూ, ముస్లిం, క్రైస్తవులు ఐక్యంగా గ్రామాభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ఏకగ్రీవానికి సహకరిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో సర్పంచ్‌ స్థానం ఎస్సీలకు రిజర్వ్‌ కావడంతో మరోసారి ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.