KDP: ఇడుపులపాయకు చెందిన టీడీపీ నేత పీపీ చెండ్రాయుడుపై దుండగులు దాడికి యత్నించిన ఘటన సోమవారం రాత్రి కలకలం సృష్టించింది. చెండ్రాయుడు ప్రయాణిస్తుండగా.. గండి రోడ్డు సమీపంలోని బృందావనం కాలనీ వద్ద కొందరు వ్యక్తులు ఆయన వాహనాన్ని అడ్డగించి దాడికి పాల్పడే ప్రయత్నం చేశారు. ఆయన వాహనానికి నిప్పు పెట్టడంతో.. కారు పూర్తిగా మంటల్లో కాలి దగ్ధమైంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ నేత వాహనానికి నిప్పంటించిన దుండుగులు


