హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో పంచాయతీ ఎన్నికలు లేవు

TPT: రాష్ట్రంలో స్థానిక ఎన్నికల సందడి సాగుతున్నా తిరుమలలో పంచాయతీ ఎన్నికలు జరగవు. పేరుకు గ్రామ పంచాయతీ అయినా, ఎండోమెంట్ల చట్టం కింద ప్రత్యేక ప్రాంతంగా ఉండటంతో 1964 నుంచి టీటీడీ ఈవోనే పంచాయతీ అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలి ఓటర్ల జాబితా సవరణ తర్వాత ఇక్కడ 3,633 మంది ఓటర్లున్నారు. వీరు ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో మాత్రమే ఓటేస్తారు.