హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాగావళి నదిలో పోలీసుల విస్తృత గాలింపు

శ్రీకాకుళం మండలం పీజీపేట సమీపంలో నాగావళి నది సముద్రంలో కలిసే సంగమ ప్రాంతంలో ఈనెల 9న గల్లంతైన గొల్లపల్లి మనోజ్ ఆచూకీ కోసం విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్పీ కె.వి. మహేశ్వరరెడ్డి ఆదేశాలతో నేవీ, కోస్టగార్డు, మెరైన్ పోలీసుల సమన్వయంతో గాలింపు చేపట్టారు. డ్రోన్లు, పోలీసు జాగిలాల సాయంతో సముద్ర తీర ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు.