హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కృష్ణపట్నం పోర్టులో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ..!

NLR: ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం పోర్టులో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అధికారులు రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికను ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడటంతో పాటు తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.