హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరు–తుని మధ్య తుఫాను ముప్పు

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం బలపడి ఈ సాయంత్రానికి తుపానుగా, రేపటికి అతి తీవ్ర తుపానుగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 20న మధ్యాహ్నం నెల్లూరు–తుని మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటేటప్పుడు గంటకు 120–130 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది.