హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన ఎస్సైగా రవికుమార్ బాధ్యతల స్వీకరణ

NLG: కేతేపల్లి పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా ఎం.రవికుమార్ సోమవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. నల్లగొండ పోలీస్ రిజర్వ్ (వీఆర్) నుంచి బదిలీపై వచ్చిన ఆయనకు స్టేషన్ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచుతామని తెలిపారు.