హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కంభం చెరువులో తగ్గుతున్న నీటి మట్టం

ప్రకాశం: కంభం చెరువులో రోజురోజుకు నీటి మట్టం తగ్గుముఖం పడుతోంది. చెరువు నీటి సామర్థ్యం 21 అడుగులు ఉండగా, ప్రస్తుతం 7 అడుగులకు పడిపోయింది. దీంతో చెరువు నీటిపై ఆధారపడుతున్న 25 గ్రామాల రైతులు ఇబ్బందులు పడాల్సివస్తోంది. డిసెంబర్ చివరి వరకు పంటలకు నీటిని అందించాల్సి వస్తోంది. అయితే ఇప్పటికే నీటిమట్టం చాలా వరకు తగ్గింది.