హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 20న జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నిక

NDL: నంద్యాల పట్టణంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈ నెల 20న జరగునున్న జిల్లా పరిషత్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాజకుమారి పరిశీలించారు. జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆమె వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.