హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అసంపూర్తిగా చేబ్రోలు - తల్లాపురం రోడ్డు

ELR: చేబ్రోలు నుండి తల్లాపురం వరకు ఉపాధి హామీ నిధులతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. నెలలు గడుస్తున్నా పనులు పూర్తి కాకపోవడంతో.. రోడ్డుపై కంకర రాళ్లు పైకి లేచి ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి. కోట్లాది నిధులతో వేస్తున్న రోడ్డు అసంపూర్తిగా నిలిచిపోవడంతో ప్రజలు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే రోడ్డు పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.