హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల వ్యూహాలపై ఎమ్మెల్యే దగ్గుపాటి సమీక్ష

ATP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనంతపురం నియోజకవర్గం రాజీవ్ కాలనీ గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ నాయకులతో శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ సమావేశమయ్యారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణ, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై ఆయన చర్చించారు. నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు.