ప్రకాశం: మార్కాపురం మండలం గజ్జలకొండ, తూర్పుపల్లి, పడమటిపల్లి గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను సోమవారం హైకోర్టు ఆదేశాల మేరకు నిలిపివేశారు. ఈ మూడు గ్రామాల్లో 2027 ఏప్రిల్ 12 వరకు సంబంధిత జీవో అమలును హైకోర్టు సస్పెండ్ చేసింది. దీంతో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి ఎన్నికల నోటీసులు జారీ చేయవద్దని అసిస్టెంట్ ఎలక్షన్ అథారిటీకి జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
మూడు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ నిలిపివేత


