హైదరాబాద్: 28°C
భక్తి

అయ్యప్ప దర్శనానికి పోటెత్తిన భక్తులు

కేరళంలోని శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తులు పోటెత్తారు. పంబానదిలో స్నానమాచరించి స్వామివారి సన్నిధానానికి భక్తులు పాదయాత్ర చేస్తున్నారు. అయ్యప్ప నామస్మరణతో శబరిగిరులు మార్మోగుతున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచే భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. స్వామి దర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పడుతోంది. భక్తులు ముందుగా దర్శనానికి స్లాట్ బుక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.