హైదరాబాద్: 28°C
భక్తి

రూ.300 దర్శన టికెట్ల విడుదల.. ఎప్పుడంటే?

ఈనెల 23న ఉ.10 గంటలకు తిరుమలలో అంగప్రదక్షిణం టోకెన్లు, 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్, మ.3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగుల కోటాను టీటీడీ విడుదల చేస్తుంది. ఈనెల 24న ఉ.10 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు, మ.3 గంటలకు తిరుమల, తిరుపతిలో వసతి గదుల కోటా ఆన్‌లైన్‌లో విడుదలవుతుంది. భక్తులు కేవలం అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలి.