హైదరాబాద్: 28°C
భక్తి

తిరుమల భక్తులకు అలర్ట్

తిరుమల శ్రీవారి 2027 ఫిబ్రవరి నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఈనెల 18న ఉ.10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. భక్తులు 20వ తేదీ ఉ.10 గంటల వరకు ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో నమోదు చేసుకోవాలి. డిప్‌లో టికెట్లు పొందిన వారు ఈనెల 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు నగదు చెల్లించి టికెట్లను ఖరారు చేసుకోవాలి.