హైదరాబాద్: 28°C
భక్తి

తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. క్యూలైన్లు శిలాతోరణం వరకు చేరుకున్నాయి. టోకెన్లు లేని సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. ఇక నిన్న(నవంబర్ 14) శ్రీవారిని 83,670 మంది దర్శించుకోగా, 35,785 మంది తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.02 కోట్లు రాగా, 4.32 లక్షల లడ్డూలు అమ్ముడయ్యాయి. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.