శివకేశవులకు ప్రీతిపాత్రమైన కార్తీకమాసంలో ప్రకృతి ఆరాధనకు, సామాజిక ఐక్యతకు వనభోజనాలు ప్రతీకగా నిర్వహిస్తారు. ఈ మాసంలో ఉసిరి చెట్టు నుంచి వీచే గాలి శరీరానికి తగలడం, ఆయుర్వేదరీత్యా ఉసిరిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని పెద్దలు చెబుతారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఒకచోట చేరి ప్రకృతి ఒడిలో గడపడం వల్ల మనసులోని ఒత్తిడి తొలగి బంధాలు బలపడతాయి.
భక్తి
కార్తీకమాసంలో వనభోజనాలకు ప్రత్యేకత!


