హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమిలో కుంపటి... టీడీపీ, జనసేన మధ్య పోటీ

KKD: టీడీపీ, జనసేన పొత్తులో ఉన్నా కరప మండలం గొర్రిపూడిలో సర్పంచ్ పదవి కోసం ఆ రెండు పార్టీల మధ్య పోటీ నెలకొంది. టీడీపీ నుంచి చీకాల అప్పలరాజు, జనసేన నుంచి అనుకుల రాంబాబు బరిలో నిలిచారు. ఇరువర్గాలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రచారం సాగిస్తున్నాయి. కూటమి పార్టీల నేతలు ఇద్దరి ప్రచారంలోనూ పాల్గొంటుండటంతో గ్రామంలో చర్చ మొదలైంది.