హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కైకలూరును మున్సిపాలిటీగా మార్చాలి: స్థానికులు

ELR: కైకలూరు పంచాయతీని మున్సిపాలిటీగా మార్పు చేసే అంశం నోటి మాటలకే పరిమితమైందని స్థానికులు అంటున్నారు. సరిపడా జనాభా.. పట్టణానికి తీసిపోని వసతులు ఉన్నా గ్రామ పంచాయతీగానే కొనసాగుతోందని తెలిపారు. మున్సిపాలిటీగా మార్చితే అధిక నిధులు సమకూరి రోడ్లు, తాగునీరు, డ్రెయినేజీ వ్యవస్థ, మౌలిక వసతుల కల్పన వేగం పుంజుకుంటుందని ప్రజలు తెలుపుతున్నారు.