హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రామ పోరుకు పోలీస్ శాఖ సన్నద్ధం!

కర్నూలు: జిల్లాలో తొలి విడత ఎన్నికలు జరిగే 148 గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు అధికారులు నిఘా పెంచారు. ప్రధానంగా 37 ఫ్యాక్షన్, సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా వ్యాప్తంగా నిన్నటి వరకు పాత నేరస్థులతో పాటు సమస్యాత్మక వ్యక్తులు 8777 మందిపై 1831 బైండోవర్ కేసులు నమోదు చేశారు. రూ. 79.07 నగదు పట్టుకున్నారు.