హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండో రోజు ఎన్ని నామినేషన్‌లు వచ్చాయంటే!

కర్నూలు: జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్‌లో భాగంగా రెండో రోజు అన్ని స్థానాలకు కలిపి 1697 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎన్నికలు జరగనున్న ఎనిమిది మండలాల పరిధిలో సర్పంచి స్థానాలకు 510, వార్డు స్థానాలకు 1187 నామపత్రాలు వచ్చాయి. సర్పంచ్ స్థానాలకు అత్యధికంగా పొన్నలూరు మండలంలో, వార్డు స్థానాలకు టంగుటూరు మండలంలో దాఖలయ్యాయి.