హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాలీబాల్ విన్నర్‌గా సెయింట్ ఆన్స్ జట్టు!

బాపట్ల: నరసరావుపేట తిరుమల ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన జేఎన్‌టీయూకే సెంట్రల్ జోన్ మహిళల వాలీబాల్ పోటీల్లో వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ జట్టు విన్నర్‌గా నిలిచింది. ఫైనల్స్‌లో భీమవరం విష్ణు కళాశాలపై విజయం సాధించినట్లు కాలేజ్ యాజమాన్యం తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థినులు అనిత, హారిక ఇంటర్ యూనివర్సిటీ జట్టుకు ఎంపికయ్యారు.