హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల బరిలో మాజీ ఎమ్మెల్యే కూతురు

కోనసీమ: ప్రజాసేవకు వయసు అడ్డంకి కాదని నిరూపిస్తూ 76 ఏళ్ల వయసులో మాజీ ఎమ్మెల్యే కుమార్తె నగరం గ్రామంలో ఎన్నికల బరిలోకి దిగారు. దివంగత మాజీ ఎమ్మెల్యే నీతిపూడి గణపతి రావు తనయురాలు ఓం శ్రీబాల రాజ్య వెంకటలక్ష్మి సోమవారం నగరం గ్రామ పంచాయతీ పరిధిలోని 10వ వార్డు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. 76 ఏళ్ల వయసులోనూ ఆమె చూపుతున్న ఉత్సాహం ఆకట్టుకుంది.