'రే-బాన్' మెటా స్మార్ట్ గ్లాసెస్ తయారీలో మన జిల్లా అమ్మాయి కీలక పాత్ర పోషించారు. ఆమె సాయి చరిత. ఐఐటీ బాంబేలో బీటెక్ పూర్తి చేసి, గోల్డ్‌మన్ శాక్స్‌లో ఉద్యోగాన్ని వదిలి ఏఐ పరిశోధనల వైపు అడుగులు వేశారు. న్యూయార్క్ యూనివర్సిటీలో 4.0 జీపీఏతో మాస్టర్స్ పూర్తి చేసి, ఫెలోషిప్ అందుకున్నారు. మిలీనియం సంస్థలో ఏఐ వ్యవస్థలను రూపొందించిన ఆమె.. అనంతరం మెటాలో చేరి తన ప్రతిభ చాటుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
'మెటా' స్మార్ట్ గ్లాసెస్ వెనుక మన జిల్లా అమ్మాయి కృషి!


