హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'దెబ్బతిన్న రహదారులు మరమ్మత్తులు చేపట్టాలి'

PPM: అర్నాబ్‌ తుఫాన్‌ కారణంగా పాచిపెంట మండలంలో దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు చేపట్టాలని CPM నాయకులు కోరాడ ఈశ్వరరావు డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. తుఫాన్‌ సమయంలో కొండవాగుల కారణంగా ఏజెన్సీ గ్రామాల్లో రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. దీంతో పలు గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు స్పందించాలని కోరారు.