హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్కడ నీళ్లిస్తేనే ఏకగ్రీవం.. GP తీర్మానం!

కర్నూలు: పల్లెల్లో పంచాయతీ ఎన్నికలు వేడిపుట్టిస్తున్నాయి. పదవులను ఏకగ్రీవాలకు వేలంపాట నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మద్దికెర మండలం బురుజుల గ్రామస్తులు ఊరికి నీళ్లిచ్చినోళ్లను ఏకగ్రీవం చేయాలని తీర్మానించారు. సమస్య పరిష్కరానికి ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే( కనీసం రూ.20 లక్షలు) వారిని ఎన్నుకోవాలని నిర్ణయించారు. ఏకగ్రీవం అయితే ప్రభుత్వ నిధులు కూడా వస్తాయని వారు అభిప్రాయపడుతున్నారు.