IDBI బ్యాంకు ఉద్యోగ సంఘాలు డిసెంబర్ 3న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. అన్ని బ్రాంచుల్లో స్ట్రైక్ చేస్తామని నోటీసులో పేర్కొన్నాయి. కెనడా కంపెనీ ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌కు బ్యాంకులో 60% వాటాను విక్రయించడాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె చేపట్టనున్నాయి. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని బ్యాంక్‌కు ప్రభుత్వరంగ హోదాను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే సమ్మెకు దిగుతామని హెచ్చరించాయి.
వ్యాపారం
IDBI బ్యాంక్ ఉద్యోగుల సమ్మె.. ఎప్పుడంటే?


