హైదరాబాద్: 28°C
వ్యాపారం

నోయల్‌పై జిమ్మీ టాటా విమర్శలు

టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయల్ టాటాపై రతన్‌ టాటా ట్రస్ట్‌ ట్రస్టీ జిమ్మీ సంచలన ఆరోపణలు చేశారు. స్వచ్ఛంద సంస్థలపై కుటుంబ ఆధిపత్యాన్ని పటిష్ఠం చేసుకోవాలని నోయల్ ప్రయత్నిస్తున్నారని జిమ్మీ ఆరోపించారు. హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్‌ను దొడ్డిదారిన చేజిక్కించుకునే ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సేవ కోసం టాటా ట్రస్టులను పూర్వీకులు నెలకొల్పారని గుర్తు చేశారు.