హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ డిఆర్ఓగా అనిత బాధ్యతలు

విశాఖ జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో)గా ఎస్.ఓ. అనిత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ పోస్టులో పనిచేసిన ఎం. విశ్వేశ్వర నాయుడిని బదిలీ చేయడంతో ప్రభుత్వం అనితను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో విజయనగరం జిల్లా రెవెన్యూ అధికారిగా ఆమె పనిచేశారు. కలెక్టరేట్ అధికారులు డీఆర్వోను కలిసి అభినందించారు.