హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మొగల్తూరులో నామినేషన్ల జోరు.. ఒకేరోజు 412 దాఖలు!

ఎన్టీఆర్: మొగల్తూరు మండలంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. సోమవారం సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. సర్పంచ్ స్థానాలకు 85, వార్డు సభ్యుల స్థానాలకు 327 నామినేషన్లు అందినట్లు ఎంపీడీవో త్రిశూల పాణి తెలిపారు. దీంతో ఒక్కరోజే మొత్తం 412 నామినేషన్లు దాఖలయ్యాయి.