హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 23న డాక్ అదాలత్

ASR: తపాలా సేవలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ఈనెల 23వ తేదీన డాక్ అదాలత్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. అనకాపల్లి డివిజన్ కార్యాలయంలో ఉదయం 11:30 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని తపాలా సహాయ సూపరింటెండెంట్ డి.వి.ఎన్. ప్రతాప్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.